అడ్డుకున్నందుకే హత్య

10 Aug, 2016 16:56 IST|Sakshi
అడ్డుకున్నందుకే హత్య
రహిమాన్‌ హత్య కేసులో నిందితులు అరెస్టు 
రెండు వారాల్లో కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
సీసీ కెమెరా ఫుటేజి ద్వారా నిందితుల గుర్తింపు
 
కర్నూలు: ఇంటి ముందు తోపుడుబండి నిలుపుకునే విషయంలో అడ్డు చెప్పడం, ఈ కారణంగా చోటుచేసుకున్న చిన్న గొడవ హత్యకు దారితీసింది. పాతబస్తీలోని మాసూంబాషా దర్గా దగ్గర జుబేదాబేగం ఇంటి ముందు సయ్యద్‌ సిరాజుద్దీన్‌ రిక్షా బండి నిలుపుకునే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఆమె కుమారుడు షేక్‌పుర్ఖాన్‌ రహిమాన్‌ హత్యకు కారణమైంది. రహిమాన్‌ పాతబస్తీలో ఈజీఎస్‌ మెన్స్‌వేర్‌ రెడిమేడ్‌ దుకాణం నడుపుతున్నాడు.

నిందితులు సయ్యద్‌ సిరాజుద్దీన్, అతని సోదరుడు సయ్యద్‌ రియాజుద్దీన్‌ సమీపంలోనే ఎస్‌ఆర్‌ సప్లయర్స్, ఎన్‌ఎస్‌ఆర్‌ సప్లయర్స్‌ నడుపుతున్నారు. తోపుడు బండి నిలుపుకునే విషయంలో ఆరునెలులగా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. గత నెల 29 సాయంత్రం 7 గంటల సమయంలో పుర్ఖాన్‌రహిమాన్‌ ఇంట్లో ఉండగా నిందితులు సిరాజుద్దీన్, రియాజుద్దీన్‌ బయటికి పిలిచి దాడి చేశారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

తల్లి జుబేదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు వారాల్లో మిస్టరీని ఛేదించారు. ఫిర్యాది ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు.  రాధాకష్ణ టాకీసు దగ్గర అదుపులోకి తీసుకొని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఇందుకు సంబంధించి వివరాలను వన్‌టౌన్‌ స్టేషన్‌లో డీఎస్పీ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
>
మరిన్ని వార్తలు