నేడు జిల్లాలో నేషనల్‌ డీ వార్మింగ్‌ డే | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో నేషనల్‌ డీ వార్మింగ్‌ డే

Published Wed, Aug 10 2016 12:02 AM

Today, the National D-Day Warming

  • ∙19 ఏళ్లలోపు విద్యార్థులకు
  • నులిపురుగుల మాత్రలు వేయాలి
  • ∙డీఎంహెచ్‌ఓ సాంబశివరావు 
  • ఎంజీఎం : నేషనల్‌ డీ వార్మింగ్‌ డేను పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి 19 సంవత్సరాలలోపు విద్యార్థులకు నులిపురుగులు మాత్రలు అందించేందుకు ఏ ర్పాట్లు పూర్తి చేశామని డీఎంహెచ్‌ఓ సాంబ శివరావు తెలిపారు.
     
    మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఎదుట నేషనల్‌ డీ వార్మింగ్‌ డే ప్రచార రథాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. జిల్లాలో 11,81,000 మంది పిల్లలకు ఈ మాత్రలు అందించేందుకు 4,587 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలతో పాటు 4,500 అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసినట్లు తెలిపారు. డీవార్మింగ్‌ డే సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చామని, ప్రచార సామగ్రితో పాటు మాత్రలను పంపిణీ చేశామని చెప్పారు.  జిల్లా కలెక్టర్‌ కరుణ ఆదేశాలతో విద్యాశాఖ, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలతో నులిపురుగుల మాత్రలు విద్యార్థులకు ఇప్పించేలా సమన్వయ సమావేశాలు నిర్వహించామని అన్నా రు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహారలోపం, బలహీనత, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఏకాగ్రత లోపించి చదువులో వెనుకబడుతారని పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకోమారు ఈ మాత్రలు ఇ వ్వడం వల్ల విద్యార్థుల్లో ఇలాంటి లక్షణాలు తగ్గి చురుకుగా ఉంటారన్నారు. 1–5 సంవత్సరాలలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలలో, 6 నుంచి 19 సంవత్సరాలలోపు వారికి పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలు వేస్తారని అన్నారు. 

Advertisement
Advertisement