కార్గిల్‌ మాజీ సైనికులకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలి

26 Jul, 2016 22:33 IST|Sakshi
కార్గిల్‌ మాజీ సైనికులకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలి

నల్లగొండ క్రైం
 మాజీ సైనికులకు సంక్షేమ డైరెక్టర్‌ ద్వారా రూ.5 వేల పెన్షన్‌ అందించాలని జిల్లా సైనిక సంక్షేమ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాపిరెడ్డి కోరారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2009 కార్గిల్‌ యుద్ధంలో 559 మంది సైనికులు వీరమరణం పొందారని, ఎంతో మంది సైనికులు అంగవైకల్య జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక మ్యారెజ్‌ గ్రాంట్‌æ’ 20 వేలు, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, విద్యారహిత గ్రాంట్లు, క్యాంటిన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ సైనికులకు ఘనంగా సన్మానించారు. సైనిక కుటుంబాలకు దుస్తులను అందజేశారు. అనంతరం మొక్కలు నాటారు.  కార్యక్రమలో సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, కత్తి భాస్కర్‌రెడ్డి, ఇంద్రయ్య, మురళీధర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, షకిల్, మారయ్య, ఉదయ్‌సింగ్, చినవెంకట్‌రెడ్డి, యాదగిరి, కుశలయ్య పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు