చిన్నారి నిహారికకు ‘నర్తనబాల’ అవార్డు

19 Jul, 2016 20:55 IST|Sakshi
చిన్నారి నిహారికకు ‘నర్తనబాల’ అవార్డు


కడప కల్చరల్‌ :

కడప నగరానికి చెందిన స్పందన డ్యాన్స్‌ అకాడమి విద్యార్థి చిన్నారి నిహారిక నర్తనబాల అవార్డు సాధించింది. ఏలూరులో అభినయ నృత్యభారతి సంస్థ ఐదు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి బాలల నృత్యోత్సవాల సందర్భంగా ఆమె తన ప్రతిభ చూపి ఈ అవార్డును సాధించారు. ఆదివారం రాత్రి ఏలూరులోని వైఎంహెచ్‌ఏ హాలులో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు డాక్టర్‌ వేదాంతం, రాధేశ్యాం, నాటాచార్య హేమసుందరం ఆమెకు ఈ అవార్డును అందజేశారు.

కులపతి, నాట్యాచార్య ఘంటా కనకారావు స్మారక నర్తనబాల అవార్డును దక్కించుకున్న నిహారికకు నాట్య గురువులు స్పందన, ప్రీతి నిహారిక అభినందనలు తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి, స్పందన డ్యాన్స్‌ అకాడమి ప్రధాన కార్యదర్శి మాడా బ్రహ్మం ఆ చిన్నారిని ఆశీర్వదించారు.  తల్లిదండ్రులు మురళి, లక్ష్మి సృజన, బంధువులు సరోజమ్మ, గౌరి, భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆమెను అభినందనలతో ముంచెత్తారు.

 

మరిన్ని వార్తలు