నేటి నుంచి జాతీయ స్థాయి నాటిక పోటీలు

14 May, 2017 00:15 IST|Sakshi
–మూడురోజుల పాటు ప్రదర్శనలు
కర్నూలు(హాస్పిటల్‌): టీజీవీ కళాక్షేత్రం(లలితకళాసమితి) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14, 15, 16వ తేదీల్లో జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్‌ టీజీ భరత్, అధ్యక్షుడు పత్తి ఓబులయ్య చెప్పారు. శనివారం స్థానిక మౌర్య ఇన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహించడం  11వ సారన్నారు. నేటితరం, భావితరాలు మన సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు  చెప్పారు.   14న సాయంత్రం 6గంటలకు ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, 16వ తేదీన ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ హాజరవుతారని వెల్లడించారు.
 
నాటక ప్రదర్శనల వివరాలు
–14వ తేది రాత్రి 7.30 గంటలకు శ్రీ జయ ఆర్ట్స్, హైదరాబాద్‌ వారి ‘సందడే సందడి’
–14వ తేది రాత్రి 8.30 గంటలకు శ్రీ అంజన రాథోడ్‌ థియేటర్స్‌ వారి ‘సప్తపది’
–15వ తేది సాయంత్రం 6.30 గంటలకు శ్రీ ఉషోదయ కళానికేతన్, కాట్రపాడు వారి ‘గోవు మాలక్ష్మి’
–15  రాత్రి 8 గంటలకు శ్రీ శాలివాహన కళామందిర్, చెన్నూరు, నెల్లూరు వారి ‘మనిషి కాటు’
–15  రాత్రి 9 గంటలకు నెల్లూరు వారి ‘మాతృవందనం’
–16వ తేది ఉదయం 10.30 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరి వారి ‘చాలు ఇక చాలు’
–16వ తేది మధ్యాహ్నం 11.45 గంటలకు శ్రీమూర్తి కల్చలర్‌ అసోసియేషన్‌ వారి ‘అంతిమతీర్పు’
–16వ తేది మధ్యాహ్నం 12.45 గంటలకు సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్‌ వారి ‘కల్లం దిబ్బ’
 
 
మరిన్ని వార్తలు