-

పాపికొండల్లో జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌

27 Dec, 2016 23:02 IST|Sakshi
  • 13 జిల్లాల నుంచి 135 మంది ఫొటోగ్రాఫర్ల రాక
  • ప్రత్యేక బోటులో పయనం
  • రాజమహేంద్రవరం సిటీ :  
    గతకాలపు చెరదని జ్ఞాపకాల దొంతరలకు సజీవసాక్ష్యం ఫొటో అని సమాచార శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ ప్రాన్సిస్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ సహకారంతో పాపికొండల ప్రాంతంలో నాలుగు రోజు ల పాటు నిర్వహించే 8వ జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌ను రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌ వద్ద జెండా ఊపి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అద్భుత దృశ్యాలను కెమెరాల్లో బంధించేందుకు ఫొటో గ్రాఫర్లు ఎంతో శ్రమిస్తుంటారని చెప్పా రు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చక్కని ఫొటోలు తీస్తూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఫొటోగ్రాఫర్లను ఆయన అభినందించారు. ఫొటోలు వాస్తవికతకు అద్దం పడతాయన్నారు. 13 రాష్ట్రాలకు చెందిన 135 మంది ఫొటోగ్రాఫర్లు పాపికొండల ప్రాంతంలో జరిగే ఫొటో వర్క్‌షాపులో పాల్గొనేందుకు ప్రత్యేక బోటులో బయలుదేరి వెళ్లారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌ షాపులో ల్యాండ్‌స్కేప్, ఫ్యాషన్, జర్నలి జం, ట్రావెల్, ఫిక్టోరియల్‌ విభాగాల్లో శిక్షణ ఇస్తామని ఫొటోగ్రఫీ అకాడమీ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు తెలిపా రు. ఫెడరేష¯ŒS ఆఫ్‌ ఇండియ¯ŒS ఫొటోగ్రఫీ జనరల్‌ సెక్రటరీ బి.కె.సిహ్వ, ప్రముఖ అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఫొటోగ్రాఫర్‌ సిరీస్‌ కరాలే, ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ సెక్రటరీ సువర్ణాగేడే, ఫొటోగ్రఫీ అకాడమీ కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి, బి.కె.అగర్వాల్‌  పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు