‘నేను.. లోకల్‌’ ఆడియో విడుదల

15 Jan, 2017 22:31 IST|Sakshi
  • ‘సాగర సంబరాల’ వేదికపై సందడి
  • కాకినాడ రూరల్‌ : 
    యువహోరీ నాని నటించిన ‘నేను..లోకల్‌’ ఆడియో విడుదల సాగర సంబరాల్లో వేలాదిగా తరలి వచ్చిన ప్రజల మధ్య శనివారం రాత్రి జరిగింది. సినిమాలోని మొదటి పాట ‘నెక్సŠట్‌ ఏమిటి’ వీడియో ప్రోమోను రూరల్‌ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు, ‘చంపేసావే’ ప్రోమోను కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, శ్రీదేవి దంపతులు విడుదల చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ తాను సంగీతదర్శకత్వం వహించిన చిత్రం ఆడియో విడుదలను తన సొంత జిల్లాలో అదీ సాగరతీరంలో జరిగే సంబరాల్లో చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పాటలన్నీ అద్భుతంగా ఉంటాయన్నారు. హీరో నాని మాట్లాడుతూ  ‘నేను.. లోకల్‌’ ఆడియో విడుదలకు పర్యాటక శాఖ మంచి అవకాశం ఇచ్చిందని, సాగరసంబరాల్లో ప్రజల మధ్య ఆడియో విడుదలను చూస్తే సినిమా నూరు రోజుల పండగ చేసుకున్నట్లు ఉందని అన్నారు. పాటలను పాడి డ్యా¯Œ్సలు వేశారు. అనంతరం ‘డెస్టినేష¯ŒS’ అనే పాట వీడియో ప్రోమోను మున్సిపల్‌ కమిషనర్‌ ఆలీం బాషా, శ్రీనికేత¯ŒS అధినేత దొరబాబు విడుదల చేశారు. సినిమా యూనిట్‌తో పాటు ఏఎస్పీ దామోదర్, టూరిజం డీఈఈ భీమశంకరం, హీరోయి¯ŒS కీర్తి, సురేష్, నిర్మాత దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు