డిండి టెండర్ల గడువు వారం పొడిగింపు

8 Aug, 2016 20:10 IST|Sakshi

- ఈ నెల 17 వరకు పొడగించిన నీటి పారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్

డిండి ఎత్తిపోతలకు సంబంధించి టెండర్ల గడువును ప్రభుత్వం మరో వారంపాటు పొడగించింది. ప్రాజెక్టు సాంకేతిక టెండర్లను మంగళవారం తెరవాల్సి ఉన్నప్పటికీ దాన్ని మరో వారం పాటు పొడగిస్తూ నీటి పారుదల శాఖ నిర్ణయం చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రీబిడ్ సమావేశంలో కాంట్రాక్టర్లు పలు సవరణలు కోరడం, వాటిని ఆమోదించిన ప్రభుత్వం టెండర్ల నోటిఫికేషన్ వాటిని చేర్చి సవరణలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం చేసినట్లు తెలిసింది. ఈనెల 17 ప్రాజెక్టు సాంకేతిక టెండర్లను తెరిచే అవకాశాలున్నట్లు నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. రూ.3,940కోట్లతో ప్రాజెక్టును 7 ప్యాకేజీలుగా విభజించి గత నెల 20న డిండికి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు