రవాణా శాఖలో నేటి నుంచి ఆన్‌లైన్‌ సేవలు

14 Oct, 2016 22:58 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : రోడ్డు రవాణా శాఖలో శనివారం నుంచి ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభిస్తున్నట్లు అనంతపురం ఉప రవాణా కమిషనర్‌ (డీటీసీ) సుందర్‌వద్ది తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు గుత్తిరోడ్డులోని దుర్గా ఆటోమోటివ్స్‌ నుంచి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు వివరించారు. నూతనంగా వాహనం కొనుగోలు చేసే వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ మొత్తం డీలర్‌ నుంచి కానీ, నేరుగా ఆన్‌లైన్‌లో కానీ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు