వేదాల పునాదిపై జాతి సంస్కతి

28 Aug, 2016 00:44 IST|Sakshi
– ఆర్య సమాజ్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రయ్య
మహబూబ్‌నగర్‌ కల్చరల్‌: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ సంస్కతి వేదాల పునాదిపై నిర్మంచబడిందని ఆర్యసమాజ్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌ చంద్రయ్య అన్నారు. ఆర్య సమాజ్‌ ఆద్వర్యంలో స్థానిక బ్రాహ్మణవాడిలోని సమాజం మందిరంలో మూడు రోజులపాటు నిర్వహించిన యజుర్వేద పారాయణ మహాయజ్ఞం శనివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ యజ్ఞాల వల్ల వాతావరణంలోని కాలుష్యం అంతరిస్తుందని, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని శాస్త్రాలు, వేదపురాణాలు తెలుపుతున్నాయని అన్నారు. «ధర్మప్రబోధాల ద్వారా శాంతియుత సహజీవనాన్ని కొనసాగించవచ్చని అన్నారు. తమ సంస్థ పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో పాపభీతి, దైవభక్తి పెంచుతున్నదని వెల్లడించారు. ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు  శివకుమార్, ధార్మికవేత్తలు ఆచార్య విశ్వ, కేవీరెడ్డి యాగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సమాజం ప్రతినిధులు నర్సింహరెడ్డి, జయపాల్‌ సులాఖే, కిషన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు