పాకాలలో పర్యాటకుల సందడి

25 Sep, 2016 22:25 IST|Sakshi
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం : మండలంలోని పాకాల సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 ఫీట్లు కాగా, ప్రస్తుతం 30.10 ఫీట్ల నీటిమట్టంతో మత్తడి పోస్తోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సరస్సులోకి భారీగా నీరు వచ్చి చేరింది. పాకాల సరస్సు 2008, 2010, 2012, 2013 సంవత్సరాల్లో మత్తడిపోసింది. ఆ తర్వాత 2014, 2015 సంవత్సరాల్లో మత్తడిపడేంత నీటిమట్టం నమోదు కాలేదు. కాగా, ఈ ఏడాది కూడా సరస్సు నిండే అవకాశాలు ఉండకపోవచ్చని భావించారు. కానీ గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు అంచనాలను తారుమారు చేశాయి. సరస్సులోకి భారీగా నీరుచేరి మత్తడిపోసింది. పర్యాటకుల తాకిడి ఎక్కువవడంతో మత్తడి పడుతున్న ప్రదేశానికి వాహనాలు నేరుగా వెళ్లకుండా గూడూరు సీఐ రమేష్‌నాయక్, ఎస్సై దుడ్డెల గురుస్వామి పాకాలలో చెక్‌పోస్టును ఏర్పాటు చేసి, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 
మరిన్ని వార్తలు