అంధుల సంక్షేమానికి కృషి

11 Sep, 2016 23:05 IST|Sakshi
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో అంధులకు సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు కృషి చేస్తామని అంధ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి.రవీంద్రబాబు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని విజేత హోటల్లో సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ 104 ప్రకారం అంధుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1800 మంది అంధులు ఉన్నారని, అందరికీ ప్రభుత్వ పింఛన్‌ అందకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విద్యావంతులైన అంధులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కోల వెంకటరమణ మాట్లాడుతూ  అంధుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.  
 
నూతన కార్యవర్గమిదే..
జిల్లా అధ్యక్షునిగా కోల వెంకటరావు, ఉపాధ్యక్షునిగా కె.అప్పలనాయుడు, కోశాధికారిగా ఎ.రాము, కార్యదర్శిగా వై.అమ్మన్నాయుడు, సంయుక్త కార్యదర్శి వి.గోవిందరావు, కార్యనిర్వహణ కార్యదర్శిగా పి.శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వై.వెంకటప్పడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
 
మరిన్ని వార్తలు