శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి

18 Mar, 2017 23:39 IST|Sakshi
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో 3.649 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 1.874 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 1.775 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 7,921 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ 164 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల 288 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్‌ సిబ్బంది తెలిపారు. మొత్తం జలాశయంలో 37.5560 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.డ్యాం నీటిమట్టం 815.30 అడుగులుగా నమోదైంది.  
 
మరిన్ని వార్తలు