45 మండలాల్లో వర్షపాతం

7 Aug, 2017 22:51 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: ఆదివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా 45 మండలాల పరిధిలో 4.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. నల్లచెరువులో  అత్యధికంగా 42.6 మి.మీ కురవగా, ఓడీచెరువు 29.7 మి.మీ, నల్లమాడ 20.2 మి.మీ, శెట్టూరు 18.3 మి.మీ, బ్రహ్మసముద్రం 17.3 మి.మీ, కదిరి 16.9 మి.మీ, కుందుర్పి 16.3 మి.మీ, గుత్తి 13.8 మి.మీ, తనకల్లు 12 మి.మీ, బుక్కపట్నం 11.2 మి.మీ, యాడికి 10.5 మి.మీ వర్షం కురిసింది. గుంతకల్లు, తాడిపత్రి, పామిడి, గుమ్మఘట్ట, పుట్లూరు, అమడగూరు, కొత్తచెరువు సహా మరో 10 మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఆగస్టు నెలలో 88.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా..ఇప్పటి వరకు 11 మి.మీ వర్షం కురిసింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు