మహా రాజమహేంద్రి

8 Feb, 2017 23:50 IST|Sakshi
మహా రాజమహేంద్రి
విలీన ప్రతిపాదిత గ్రామాలకు వర్తింపజేసేలా కౌన్సిల్‌ ఆమోదం
ప్రతిపాదించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 
రాజానగరంతోపాటు 8 గ్రామాలు, వేమగిరికి కూడా మాస్టర్‌ప్లాన్‌
తాజా ప్లాన్‌తో నగర విస్తీర్ణం 118.33 చ.కి.మీ
10 పంచాయతీల కలయికతో పెరగనున్న పదిరెట్ల విస్తీర్ణం
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగర చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని 13 గ్రామ పంచాయతీలను కలుపుతూ నగరపాలక మండలి ఆమోదించిన మాస్టర్‌ప్లాన్‌ పరిధి మరింత విస్తరించనుంది. విలీన ప్రతిపాదనలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల పరిధిలోని 21 పంచాయతీలకు, విలీన ప్రతిపాదన లేని కడియం మండలం వేమగిరిని కలిపి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసే ప్రతిపాదన మండలి ఆమోదించింది. బుధవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ అంశాన్ని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాదించగా మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. గతేడాది వరకు 1975లో రూపొం దించిన మాస్టర్‌ ప్లాన్‌ నగరంలో అమలులో ఉంది. పలు కారణాలతో ఇది అమలుకు నోచుకోలేదు. ఇప్పటి వరకు నగర విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్లు. 2031 నాటి అభివృద్ధిని అంచనా వేస్తూ రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నగర చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల దూరంలోని 13 పంచాయతీలను కలిపారు. ఇందులో రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలోని కాతేరు, కోలమూరు, పాలచర్ల, లాలాచెరువు, పిడింగొయ్యి, హుకుంపేట, శాటిలైట్‌సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, గాడాల, తొర్రేడు, రాజానగరం మండల పరిధిలోని దివా¯ŒS చెరువు, కోరుకొండ మండలంలోని మధురపూడి(ఎయిర్‌పోర్టు) ఉన్నాయి. వీటిని కలుపుతూ మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి గత ఏడాది డిసెంబర్‌ 3న ఆమోదించారు. ఫలితంగా 118.33 చ.కి.మీ విస్తీర్ణం కలవడంతో నగర పరిధి 162.83 చ.కి.మీ మేర పెరిగింది. 
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీన ప్రతిపాదన లేని వేమగిరి పంచాయతీకి కూడా మాస్టర్‌ప్లా¯ŒSను వర్తింపజేయాలన్న ఆలోచనకు  రావడానికి అనేక అంశాలు దోహదం చేశాయి. మాస్టర్‌ప్లా¯ŒS పరిధిలో ఉన్న ధవళేశ్వరం గ్రామానికి వేమగిరి సమీపంలో ఉంటుంది. అదీగాక 216 నంబర్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉండడం, అక్కడ జీఎంఆర్, సర్వారాయ బాటిలింగ్‌ యూనిట్‌(కోకాకోలా), యువరాజ్‌ పవర్‌ప్లాంట్‌ తదితర పరిశ్రమలు ఉండడంతో మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేస్తే సౌకర్యాలు మెరుగుపడి అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఈ ప్రతిపాదన చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
మరింతగా నగర పరిధి..
ప్రస్తుతం నగరానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని 13 పంచాయతీలను కలుపుతూ మాస్టర్‌ప్లాన్‌ రూపొందించడంతో నగర పరిధి 162.83 చ.కి.మీకు చేరుకుంది. ఇది గతంలో కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. తాజాగా నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బూరుగుపూడి, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజానగరం, రాజవోలు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరి, వెంకటనగరం పంచాయతీలను కూడా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి, అమలుచేయాలనే ప్రతిపాదనను కౌన్సిల్‌ ఆమోదించడంతో నగర పరిధి పలురెట్లు విస్తరించనుంది.
విలీన ప్రతిపాదిత మండలాలకు మాస్టర్‌ప్లాన్‌
రాజమహేంద్రవరం నగరంలో కోరుకొండ, రాజానగరం, రాజమహేద్రవరం రూరల్‌ మండలాలల్లోని 21 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలన్న ప్రతిపాదనలు నాలుVó ళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌ ఉన్నాయి. ఇందులో నగరానికి ఐదు కిలో మీటర్ల పరిధిలోని 13 పంచాయతీలను కలుపుతూ మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. అయితే తాజాగా విలీన ప్రతిపాదన ఉండి మాస్టర్‌ప్లాన్‌లో చేర్చని రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలోని రాజవోలు, వెంకటనగరం, రాజానగరం మండలంలోని రాజానగరం, నామవరం, చక్రద్వారా బంధం, వెలుగుబంద, నరేంద్రపురం, కోరుకొండ మండల పరిధిలోని బూరుగుపూడి, నిడగట్లకు మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసి వర్తింపజేయాలని కౌన్సిల్‌ ఆమోదించిది. ఈ పంచాయతీలతోపాటు విలీన ప్రతిపాదన లేని కడియం మండలం వేమగిరి పంచాయతీని కూడా మాస్టర్‌ప్లాన్‌ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది.
 
మరిన్ని వార్తలు