చదువుల ‘రాజ్యం’ అస్తమయం

12 Dec, 2016 15:13 IST|Sakshi
  • ఏయూ తొలి మహిళా రీసెర్చ్‌ స్కాలర్‌గా గుర్తింపు
  • పలు అవార్డులు ఆమె సొంతం
  • స్వచ్ఛంద సేవల్లోనూ తనదైన ముద్ర
  • కాకినాడ వైద్యం :
    ఆమె జీవితం సమాజానికి అంకితం.. మరణం తరువాత కూడా.. తాత రఘుపతి వెంకటరత్నం నాయుడులా ఆమె సైతం బహుముఖ ప్రజ్ఞ కనబరచి విద్యావేత్తగా సామాజికవేత్తగా ఖ్యాతి గడించారు. ఆమే డాక్టర్‌ రాజ్యలక్ష్మి
     
    సామాజిక వేత్త, చదువుల సరస్వతి, బ్రహ్మసమాజికుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు మనుమరాలు డాక్టర్‌ తెలికిచర్ల రాజ్యలక్ష్మి (88) అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె కోరిక మేరకు పరిశోధనల నిమిత్తం ఆమె పార్థివ దేహాన్ని స్థానిక రంగరాయ కళాశాలకు ఆమె సోదరుడు కుంభంపాటి కమల్‌ వెంకటరత్నం అప్పగించారు.  సెంట్రల్‌ ఇ¯ŒSలాండ్‌ బ్రేకిష్‌ ఆక్వాకల్చర్‌ (సిబా) మాజీ డైరెక్టర్, ఆలిండియా బ్రహ్మసమాజం మాజీ అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు. కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న రాజ్యలక్షి్మని ఈ నెల 6న కాకినాడలోని ఓ ప్రైవేట్‌ (సేఫ్‌) ఆస్పత్రిలో చేర్పించామని ఆమె సోదరుడు తెలిపారు. డాక్టర్‌ రాజ్యలక్ష్మి కేంద్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. శాస్త్రవేత్తగా బ్రేకిష్‌ ఆక్వాకల్చర్‌ అభివృద్ధికి  ఎంతో కృషి చేశారు. రొయ్యలపై పరిశోధనలు చేసి, అమెరికా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ సాధించారు. సంఘసంస్కరణోద్యమ నేతగా పేరొందిన కుంభంపాటి రామశాస్త్రి (తారక్‌) సుగుణ దంపతులకు 1929 లో రెండో సంతానంగా రాజ్యలక్ష్మి జన్మించారు. ఈమె 1956లో ఆంధ్రాయూనివర్సిటీలో తొలి మహిళా రీసెర్చ్‌ స్కాలర్‌గా రికార్డు నెలకొల్పారు. 1989–90లో కేంద్రప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. ఈమె భర్త శశి«భూషణ్‌ కూడా వ్యవసాయశాఖలో డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన అనంతరం కన్నుమూశారు. పదవీ విరమణ తర్వాత ఈమె ఆలిండియా బ్రహ్మసమాజం అధ్యక్షురాలిగా, కాకినాడ సమాజం అధ్యక్షురాలిగా పని చేశారు. కాకినాడలోని శ్రీరామ్‌నగర్‌లోని ఏబీసీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న డాక్టర్‌ రాజ్యలక్ష్మి తల్లి సుగుణ ప్రముఖ సంఘ సంస్కర్త రఘపతి వెంకటరత్నంనాయుడుకు కుమార్తె కావడం గమనార్హం.  
     
మరిన్ని వార్తలు