19 నుంచి రంజాన్‌తోఫా పంపిణీ

13 Jun, 2017 00:17 IST|Sakshi

– ఈ నెల16 నుంచి 18 వరకు డీలరు పాయింట్లకు సరుకులు చేర్చాలి

–జేసీ ఆదేశాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): రంజాన్‌తోఫా సరుకులను ఈనెల 19 నుంచి 27వ రకు పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ... ముస్లింలకు సంబంధించి ఇప్పటి వరకు 2.02 లక్షల కార్డులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేసిన కొత్తకార్డుల్లో ముస్లింల కార్డులను గుర్తించాల్సి ఉందని చెపా‍​‍్పరు. ఈ ప్రక్రియ 14వ తేదీకి కొలిక్కి వస్తుందని వెల్లడించారు. ఈ నెల 16 నుంచి స్టాక్‌ పాయింట్ల నుంచి డీలరు పాయింట్‌కు సరుకులు లిప్ట్‌ చేయాలని సూచించారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి సరుకులు అందే విధంగా చూడాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కానుకలు పంపిణీ చేయాలన్నారు. ఆలూరు, పత్తికొండ సీఎస్‌డీటీలకు షోకాజ్‌ నోటీసులు రంజాన్‌ తోఫా కానుకల పంపిణీపై నిర్వహించిన సమావేశానికి ఆలూరు, పత్తికొండ సీఎస్‌డీటీలు గైర్హాజరు కావడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జేసీ డీఎస్‌ఓను ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌ఓ సుబ్రమణ్యం, జిల్లా పౌరసరఫరాల సంçస్థ మేనేజర్‌ జయకుమార్, ఏఎస్‌ఓలు రాజరఘువీర్, వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు