రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించండి

26 Sep, 2016 22:03 IST|Sakshi
ఏలూరు (మెట్రో) : జిల్లాలో రేషన్‌ పంపిణీ నిమిత్తం ఈ పోస్, ఈ వేమెంట్‌ అమలు చేసినప్పటి నుంచి ఆర్థికంగా డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. తూనికలు, కొలతల శాఖ స్టాంపింగ్, సర్వీసింగ్‌ పేరుతో రూ.300, రూ.600 వసూలు విధానాన్ని నిలుపుదల చేయాలని కోరారు. ఈ పోస్, కాటాల రిపేరు నిమిత్తం రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారని, దీనిని నిలుపుదల చేయాలన్నారు. డీలర్లకు ఆహారభద్రతా చట్టం ప్రకారం రూ.87 కమీషన్‌ను పూర్తిగా అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీని కలిసిన అనంతరం వారు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి డి.శివశంకరరెడ్డిని కూడా కలిసి వినతిపత్రం అందించారు.  సంఘ జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు కానుమోలు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి వెంకట నరసింహారావు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు