సత్యదేవుని ఆలయంలో రికార్డింగ్ డ్యాన్సులు

13 Mar, 2016 10:46 IST|Sakshi
సత్యదేవుని ఆలయంలో రికార్డింగ్ డ్యాన్సులు

అన్నవరం కొండ మీద అపచారం

అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యగిరి కొండపై ఉన్న హరిహరసదన్ సత్రంలో శనివారం తెల్లవారుజామున జరిగిన వివాహ వేడుకల్లో నిర్వాహకులు అపచారానికి పాల్పడ్డారు. సత్యదేవుని సన్నిధిలో డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించారు. జిల్లాలోని తొండంగి మండలం దానవాయిపేట గ్రామానికి చెందిన టీడీపీ నేతకు చెందిన  పెళ్లి వేడుక కావడంతో  వారిని ఎవరూ నిలువరించలేకపోయారు. శనివారం తెల్లవారుజామున జరిగే గొల్లపల్లి సతీష్, దివ్యల వివాహం కో సం గత నెల 11న తొండంగి మండలం అద్దరిపేటకు చెందిన కోడె శేఖర్ ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నారు.

శుక్రవారం రాత్రి నుంచే వివాహ వేడుకలు ప్రారంభమయ్యా యి. ఒకవైపు పెళ్లి విందు జరుగుతుండగానే మరోవైపు స్టేజీ మీద సినిమా పాటలకు డ్యాన్సర్ల చేత అశ్లీల నృత్యాలు చేయించారు. దీనిపై దేవాదాయ శాఖ  మంత్రి పి.మాణిక్యాలరావు, కమిషనర్ వైవీ అనూరాధ ఈ విషయమై దేవస్థానం ఈవో నాగేశ్వరరావుకు ఫోన్ చేసి వివరాలడిగారు. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నిర్వాహకులపై తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఈవో తెలిపారు.  నృత్యాలను నిరోధించలే కపోయారన్న కారణంగా హరిహరసదన్ గుమస్తా ఎన్.గోవింద్, సెక్యూరిటీ గార్డ్ బహదూర్‌లను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా సూపరిం టెండ్ంట్ కృష్ణప్రసాద్‌తో పాటు మరో ఇద్దరికి మెమోలు ఇచ్చినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు