తల్లిని చూసేందుకు వెళుతూ...

16 Sep, 2016 23:56 IST|Sakshi
 
చల్లపల్లి/ఘంటసాల : 
టిప్పర్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తూ వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బత్తుల వెంకటేశ్వరమ్మ (37) మృతి చెందింది. చల్లపల్లికి చెందిన బత్తుల రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ దంపతులు ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి మొవ్వ మండలం యద్దనపూడి వెళుతున్నారు. ఘంటసాల మండలం చిట్టూ ర్పు కోళ్లఫారాల వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తూ వచ్చిన లారీ వీరి ౖబైక్‌వైపు దూసుకువచ్చింది. ప్రమాదాన్ని గమనించి బైక్‌ను పొదల్లోకి తిప్పేశాడు. లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. వెంకటేశ్వరమ్మకు తీవ్రగాయాలు కాగా చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. స్థానిక ప్రైవేటు స్కూల్‌లో రామకృష్ణ డ్రైవర్‌గా, వెంకటేశ్వరమ్మ వంటమనిషిగా పనిచేసేవారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు బయలుదేగా ఈ ప్రమాదం జరిగింది. 
 
మరిన్ని వార్తలు