ధాన్యం కేంద్రాల్లో రూ.44 కోట్ల గోల్‌మాల్‌

5 Oct, 2016 22:27 IST|Sakshi
ఏలూరు (మెట్రో): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన రూ.44 కోట్లు లాభంలో గోల్‌మాల్‌ జరిగిందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడతామని జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవోల  సమావేశంలో ధాన్యం కొనుగోలు తీరు, జాతీయ ఉపాధి హామీ పథకం, ఫామ్‌పాండ్స్‌ ఏర్పాటు, సంక్షేమ పథకాల ద్వారా పేదలకు రుణాల జారీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వైద్యారోగ్య శాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. కామవరపుకోట కేంద్రంలో రూ.25 లక్షలు లాభం వస్తే దీనిలో అదనపు ఖర్చుల కింద రూ.7.50 లక్షలు వినియోగించారని, లింగపాలెంలో రూ.33 లక్షలు లాభం వస్తే అదనపు ఖర్చులు కింద రూ.23 లక్షలు డ్రా చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో వచ్చిన లాభం గోల్‌మాల్‌ వ్యవహారంపై ప్రత్యేక దష్టి కేంద్రికరిస్తాననన్నారు. గ్రామాల్లో వైద్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆసుపత్రుల అభివద్ధికి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని, మౌలిక వసతుల కల్పనకు దాతల సహకారాన్ని తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.కోటేశ్వరిని ఆదేశించారు. జెడ్పీ సీఈవో డీ.సత్యనారాయణ, డ్వామా పీడీ డీ.వెంకటరమణ, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌. అమరేశ్వరరావు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు