జిల్లాలో రూ. 8కోట్ల ఆస్తిపన్ను బకాయి

12 Dec, 2016 13:51 IST|Sakshi
 నిడమనూరు : జిల్లాలోని 31మండలాల్లో ఆస్తిపన్ను బకాయిలు 8 కోట్లు పేరుకుపోయాయని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయ న నిడమనూరుకు వచ్చారు. ఈసందర్భంగా ఆయన పంచాయతీ సిబ్బం ది, గ్రామస్తులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో ఆస్తిపన్ను వసూళ్లు మందగించాయన్నారు. సిబ్బంది జీతభత్యాలకే పన్నుల వసూలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దైన నోట్లతో ఆస్తిపన్ను చెల్లించవచ్చని తెలి పారు. నిడమనూరులో డీపీఓ ప్రభాకరరెడ్డి స్వయం గా ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కరోజే 45వేల రూపాయల ఆస్తిపన్ను వసూలైంది. ఆయన వెంట ఎంపీడీఓ ఇందిర, సర్పంచ్ ముత్తయ్య, కార్యదర్శి పద్మ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు