తరలుతున్న ‘సమాచార’ కార్యాలయం

27 Sep, 2016 23:41 IST|Sakshi
ములుగు : డివిజన్ కేంద్రంలోని ఒక్కో కార్యాలయం జయశంకర్‌ జిల్లా కేంద్రం (భూపాలపల్లి)కి తరలుతున్నాయి. మొన్నటివరకు పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఐబీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ డివిజన్ కార్యాలయాల తరలింపునకు అధికారులు పనులు మొదలుపెట్టారు. తాజాగా మండలకేంద్రంలోని డివిజనల్‌ సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం సైతం తరలిపోనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ములుగు డివిజన్ కేంద్రమైన తర్వాత ఇక్కడి నుంచి డివిజన్కు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సైతం జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి కేటాయించనున్నట్లు తెలిసింది.  
మరిన్ని వార్తలు