ఉలికిపాటు

29 Jun, 2016 11:46 IST|Sakshi
ఉలికిపాటు

పర్చూరు మండలం చెన్నుంబొట్లవారిపాలెంలో
కలకలం రేపిన వరుస హత్యలు పట్టపగలే ముగ్గురు హతం
చిన్నపాటి వివాదాలే హత్యలకు  కారణం
గతంలోనూ పలుమార్లు ఘర్షణలు

పర్చూరు: పచ్చగా ఉన్న పల్లెలో పట్టపగలు వరుస హత్యలతో కలకలం రేగింది. చిన్నపాటి వివాదాలే ముదిరి ముగ్గురి ప్రాణాలు తీసింది. పగతో రగిలిన ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో గొడ్డళ్లతో దాడిచేసి భార్యాభర్తలను, అడ్డొచ్చిన మరొకరిని దారుణంగా హతమార్చారు. పర్చూరు మండలం చెన్నుంబొట్లవారిపాలెంలో మంగళవారం జరిగిన ఈ ఘటన గ్రామస్తులను భయూందోళనకు గురిచేసింది. హతులు ముగ్గురూ రైతు కూలీలే. హత్యకు గురైన కీర్తిపాటి రత్తయ్య (50), జంగా బాబు (45), జంగా సుశీల (40)పై దాడి పక్కా ప్రణాళికతోనే

 జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీ కొడుకులు దిడ్ల శాంసన్, బోస్‌లు గొడ్డళ్లతో రత్తయ్యపై దాడిచేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న జంగా బాబుపై కూడా మెడపై గొడ్డలితో నరికారు దీంతో అతనూ రక్తపు మడుగులో పడి మృతిచెందాడు. భర్త మృతదేహం వద్ద  విలపిస్తున్న భార్య జంగా సుశీల (40)ను సైతం హంతకులు వదలకుండా మెడపై గొడ్డలితో నరికి దారుణంగా చంపారు. పట్టపగలు రచ్చబండ వద్ద ఈ మారణకాండ జరుగుతున్నా గ్రామస్తులెవరూ అడ్డుకోలేకపోయూరు. భయంతో పరుగులు పెట్టారు. దాడిని అడ్డుకోబోరుున మృతుల బంధువు కీర్తిపాటి రాజుపై కూడా దాడిచేయడంతో తలకు గాయూలయ్యూరుు. అదే సందర్భంలో రత్తయ్య భార్య బూదెమ్మపై హంతకులు దాడికి యత్నించగా పరుగుపెట్టింది. అందరూ చూస్తుండగానే దాదాపు 20 నిమిషాల పాటు హత్యాకాండ సాగింది. 

 చిన్నపాటి వివాదాలే  పెద్దవై...: హతులు, హంతకులు ఒకే కాలనీకి చెందినవారు. కాలనీలో  ఆటల పోటీల సందర్భంగా ఏర్పడిన వివాదాలు ఘర్షణకు దారితీశారుు. రత్తయ్య కుమారునిపై బోసు గతంలో కత్తితో దాడిచేశాడు. ఈ విషయం అప్పట్లో పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. దాడి అనంతరం రత్తయ్య వర్గీయుల నుంచి ముప్పు పొంచి ఉందన్న భయంతో దిడ్ల శ్యాంసన్ కుటుంబం యద్దనపూడి మండలం డేగరమూడికి మకాం మార్చింది. అయితే ఇటీవల రుణమాఫీ పత్రాల కోసం మళ్లీ గ్రామానికి వచ్చారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు.

 అనాథలైన పిల్లలు: మృతులు జంగా బాబు, సుశీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ఉషా నర్సింగ్ పూర్తి చేసింది. చిన్నకుమార్తె సుస్మిత ఇంటర్ చదివింది. కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ రక్తపు మడుగుల్లో విగత జీవులై పడి ఉండటాన్ని చూసి కుమారుడు తల్లడిల్లిపోతున్నాడు. తల్లిదండ్రుల మరణంతో పిల్లలు అనాథలయ్యారు. మృతులంతా  రైతుకూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.  భర్త దారుణ హత్యకు గురికావడంతో  కీర్తిపాటి రత్తయ్య భార్య బూదెమ్మ  భోరున విలపించింది. కాలనీకి చెందిన ముగ్గురు హత్యకు గురికావడంతో  గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా