స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల చేయాలి

12 Nov, 2016 02:21 IST|Sakshi
స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల చేయాలి
  • కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ధర్నా
  •  
    నెల్లూరు(పొగతోట):
    స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నాయుడురవి డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట అందోళన చేపట్టారు. కలెక్టరేట్‌లోకి చోచ్చుకుని పోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్‌ గేట్‌కు వేసిన చైన్‌ను విద్యార్థులు లాగివేశారు. జిల్లా అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ మహమ్మద్‌ఇంతియాజ్‌ విద్యార్థి సంఘ నాయకులుతో మాట్లాడి వినతి పత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేయాలన్నారు. హస్టళ్లలో మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో​నియోజకవర్గానికి రెండు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటినీ కొత్త భవనంలోకి మార్చాలని కోరారు. 
     
     
>
మరిన్ని వార్తలు