సోమశిలకు 3,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

2 Aug, 2016 00:30 IST|Sakshi
సోమశిలకు 3,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
 
 
సోమశిల : రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల జలాశయానికి సోమవారం ఉదయం కల్లా 3,472 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమశిలకు పైతట్టు ప్రాంతాలైన పెన్నా నది ప్రధాన హెడ్‌ రెగ్యులేటర్‌ ఉన్నæ వైఎస్సార్‌ జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద 700 క్యూసెక్కుల వంతున వరద ప్రహిస్తోంది. చెన్నూరు వద్ద 1,100 క్యూసెక్కుల వరద నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 11.069 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నారు డెల్టాకు 2వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 84.32 మీటర్లు, 276.64 అడుగుల మట్టం నమోదైంది. సగటున 55 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. 
మరిన్ని వార్తలు