15వ రోజుకు చేరిన సమ్మె

1 Aug, 2016 17:07 IST|Sakshi
15వ రోజుకు చేరిన సమ్మె

కొనసాగుతున్న సెకండ్‌ ఏఎన్‌ఎంల సమ్మె

పరిగి: సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సెకండ్‌ ఏఎన్‌ఎంల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట కొనసాగించారు. ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భగా ఆ సంఘం  నాయకులు  మాట్లాడుతూ ..10వ పీఆర్సీ ప్రకారం  రూ. 21300 కనీస వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు తమ విధులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాలుగు మండలాల సెకండ్‌ ఏఎన్‌ఎంలు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు