ఉత్తమ ఫలితాలు సాధించాలి

20 Jul, 2016 23:34 IST|Sakshi
బహుమతులు అందజేస్తున్న కమిషనర్‌
  • బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ అరుణ
  • కూసుమంచి : బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆ శాఖ కమిషనర్‌ అరుణ కోరారు. కూసుమంచిలోని సమీకృత వసతి గృహాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల ప్రగతిని.. వసతులను పరిశీలించారు. అనంతరం కమిషన ర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని బాగా చదుకోవాలన్నారు. బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 18 రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 3 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు జరుగుతుందని అన్నారు. ఈ విద్యాసంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది మెరిట్‌ విద్యార్థులను గుర్తించి.. వారు ప్రభుత్వ ఖర్చుతో ఉన్నత చదువులు చదివేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. బీసీ వసతి గృహాల్లో హరితహారం కింద 30వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. అనంతరం వసతి గృహ విద్యార్థులకు హరితహారంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించగా.. విజేతలైన వారికి కమిషనర్‌ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఈడీ ఆంజనేయశర్మ, వసతి గృహం ప్రత్యేకాధికారి ఈదయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు