‘షాన్‌దార్’ ఎఫెక్ట్... | Sakshi
Sakshi News home page

‘షాన్‌దార్’ ఎఫెక్ట్...

Published Wed, Jul 20 2016 11:36 PM

‘షాన్‌దార్’ ఎఫెక్ట్... - Sakshi

గాసిప్
 
బాలీవుడ్‌లో క్యూటెస్ట్ బ్యూటీగా ఆలియా భట్‌కు పేరు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆలియా, ఆ సినిమా విజయంతో మరో ఐదేళ్ల కెరీర్ కు ఖర్చీఫ్ వేసేసుకుంది. తరువాత వచ్చిన హంప్టీ శర్మాకీ దుల్హనియా, టు స్టేట్స్ సినిమాలు ఆలియాకు నటిగా మంచి పేరు తెచ్చాయి. అయితే ఆలియా గుడ్ టైమ్ కంటిన్యూ అవలేదు. సినిమాలు బాగున్నాయని పేరొచ్చినా, ఆఫర్లు వస్తున్నా... స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లలేకపోయారు. దీనికి తోడు రీసెంట్ ఫిల్మ్ షాన్‌దార్ ఇచ్చిన రిజల్ట్... బాక్సాఫీస్ దగ్గర ఈ బ్యూటీ గుడ్ విల్ అంతా పోగొట్టింది. చాలా ఫ్లాపు సినిమాలు వస్తుంటాయి గానీ ఆలియా భట్‌కు షాన్ దార్ తెచ్చిన బ్యాడ్ నేమ్ అంతా ఇంతా కాదు. చివరికి ఫిలింఫేర్ లాంటి అవార్డుల ఫంక్షన్ వేదికల్లోనూ షాన్‌దార్‌పై సెటైర్లు వేశారు. ఈ అపజయం ఆలియా కెరీర్ దారులు మూసుకుపోయినంత ప్రభావం చూపించింది. షాన్‌దార్ సినిమాను ఉద్దేశించి ఇన్నాళ్లు ఏమీ మాట్లాడని ఆలియా భట్... ఈ మధ్య సోషల్ మీడియాలో స్పందిచారు.


ఆ సినిమా అపజయానికి తాను డిప్రెస్ అయినట్లు వచ్చిన వార్తలకు సానుకూలంగా సమాధానమిచ్చారు. ’ఫ్లాప్ సినిమాలు తనను అభద్రతాభావానికి లోను చేయవని, అయితే రాబోయే సినిమాల్లో మరింత బాగా నటించాలన్న ఆలోచనలే ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తాయని’ అన్నారు ఆలియా. ఈ ఒత్తిడి తనకు హాని చేస్తుందేమో అన్న భయం కలుగుతుంటుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల సెన్సార్ వివాదంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఉడ్తా పంజాబ్ సినిమాతో ఆలియా భట్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ స్వింగ్‌తో షారుక్ ఖాన్‌తో పెయిర్ గా సినిమా దక్కించుకుంది. ‘డియర్ జిందగీ’ పేరుతో గౌరీ షిండే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది ఆలియాకు కెరీర్ లో దక్కిన పెద్ద ఆఫర్‌గా చెప్పొచ్చు. ‘రాబోయే సినిమాల్లో బాగా నటించాలని ఆలోచిస్తున్నా’ అన్న ఆలియా భట్ స్టేట్‌మెంట్ బహుశా డియర్ జిందగీ గురించేనేమో అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్.

 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement