అసైన్డ్‌ భూములు సరెండర్‌ చేయాలి

6 Sep, 2016 21:20 IST|Sakshi

దుబ్బాక: జీవనోపాధి కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుపేద కుటుంబాలకు గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఆసైన్డ్‌ భూములను ఇతర వర్గాలు బలవంతంగా లాక్కున్నాయని, అక్రమించిన ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి సరెండెర్‌ చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు తౌడ శ్రీనివాస్‌ హెచ్చరించారు.

మంగళవారం దుబ్బాక విలేకరులతో ఆయన మాట్లాడుతూ జీవనోపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను అగ్రవర్ణాలు స్వాధీనం చేసుకుని, తహశీల్దార్‌ కార్యాలయాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తుల పేరున ఆసైన్డ్‌ భూములు వెళ్లిపోయాయని ఆరోపించారు. దళితుల అవసరాలను ఆసరా చేసుకున్న ఆగ్రవర్ణాలు అప్పులిచ్చి ఎస్సీ, ఎస్టీ భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు.

గత ప్రభుత్వాలు దళితులకిచ్చిన భూముల రికార్డులు, ఇప్పుడు ఎవరిపేరున మోటేషన్‌ అవుతున్నాయో రెవెన్యూ అధికారులు లెక్కలు తేల్చాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల నుంచి ఇతర వర్గాలకు మారిన భూ రికార్డులను సరి చూసి, సర్వే చేయాలని రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ భూములను అక్రమించిన ఇతర వర్గాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని, లేనియెడల చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు