వైఎస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ నాయకులు

26 Sep, 2016 00:12 IST|Sakshi
పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 50 మంది ఎమ్మెల్యే ఐజయ్య సమక్షంలో వైఎస్‌ఎస్‌ఆర్‌సీపీలో చేరారు.  ఆదివారం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో బాగంగా వారు ఎమ్మెల్యేతో మాట్లాడారు. సంవత్సరాల తరబడి టీడీపీలో కొనసాగుతున్నామని, గతంలో పార్టీ అధికారంలో లేకపోవడంతో గ్రామంలో అభివద్ధి జరగలేదని సర్దుకుపోయామన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ గ్రామంలో ఎలాంటి ప్రగతి లేదన్నారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోలేకుంటున్నామని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పల్లెల్లో అభివద్ధి జరుగుతుందని భావించి వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో 4వ వార్డు సభ్యుడు రమణ, నాయకులు బన్నూరు వెంకటేశ్వర్లు, గాజులవెంకటరమణ, పక్కిరయ్య, మల్లయ్యలతో పాటు 50 మంది టీడీపీ కార్యకర్తలు ఉఆన్నరు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శివారెడ్డి, చౌడయ్య, బంగారు మౌలాలి, నాగేంద్ర, శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు