తెలంగాణలోనే కళాకారులకు గుర్తింపు

7 Sep, 2016 00:09 IST|Sakshi
తెలంగాణలోనే కళాకారులకు గుర్తింపు
  • రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు
  • అలరించిన మహా భక్తశబరి పద్యనాటకం
  • హన్మకొండ కల్చరల్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాౖటెన తర్వాతనే కళాకారులకు గుర్తింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు అన్నారు. సీఎం కేసీఆర్‌ కళాకారుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. హన్మకొండలోని నేరేళ్ల వేణుమాధవ్‌ కళాప్రాంగణంలో జరుగుతున్న పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పద్యనాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన సావేరి సాంస్కృతిక సంస్థ సభ్యులు మహాభక్త శబరి పద్యనాటకాన్ని ప్రదర్శించారు. అంతకు ముందు వరంగల్‌ రంగస్థల ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ బండారు ఉమామహేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో తొమ్మిది రోజుల పాటు పద్యనాటకాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా రంగస్థల పద్యనాటక పరిషత్‌ అధ్యక్షుడు వేమూరి శ్రీనివాసమూర్తిని శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైరి రవికృష్ణ, డిప్యూటీ మేయర్‌ మహ్మద్‌ సిరాజుద్దిన్, పందిళ్ల అశోక్‌కుమార్, బూరవిద్యాసాగర్, మహేందర్‌రెడ్డి, కళా రాజేశ్వర్‌రావు, సదానందం, రంగరాజు బాలకిషన్‌ పాల్గొన్నారు. కాగా,  డాక్టర్‌ ఎన్‌. పురుషోత్తమాచార్య రాసిన మహాభక్త శబరి నాటకాన్ని హైదరాబాద్‌కు చెందిన సత్కకళాభారతి జి. సత్యనారాయణ దర్శకత్వంలో ప్రదర్శిం చారు. శబర జాతిలో జన్మించినప్పటికి భక్తి దయలను తన లో ప్రతిష్టించుకున్న శబరి శ్రీరామచంద్రుడి దర్శనాన్ని ఎలా పొందిందో కళాకారులు భక్తి రసాత్మకంగా చూపిం చారు. కాగా, బుధవారం మాతృదేవోభవ నాటక ప్రదర్శన జరుగనుంది.
     
    తెలంగాణ కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు
    సీఎం కేసీఆర్‌ కళలు, కళాకారుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. యునె స్కో ద్వారా తెలంగాణ కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పద్యనాటక సప్తాహం కార్యక్రమంలో సోమవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లా జనతా సేవా సమితి సభ్యులు విప్రనారాయణ నాట కాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ డ్రమెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆకుల సదానందం అధ్యక్షతన జరిగిన సభలో మామిడి హరికృష్ణ పాల్గొని మాట్లాడారు. శేఖర్‌బాబు తెలంగాణ పద్యనాటకాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మ మాట్లాడుతూ సీఎం కే సీఆర్‌ కళాకారులకు ఉద్యోగాలు ఇ చ్చి ఆదుకున్నారని చెప్పారు.  అనంతరం నృత్య స్రవంతి శిక్షణాలయం నిర్వాహకురాలు తాడూరి రేణుకను శాలు వా, పూలమాలలతో సత్కరించారు. సమాచారశాఖ డీడీ డీఎస్‌ జగన్, పోతనపీఠం కార్యదర్శి నమిలికొండ బాలకిషన్‌రావు, బిటవరం శ్రీధరస్వామి పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు