దత్తత గ్రామం ఎర్రవల్లిలో కేసీఆర్ పర్యటన

28 Sep, 2016 16:10 IST|Sakshi

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం దత్తత గ్రామం ఎర్రవల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వనరులను ఉపయోగించుకుని వ్యవసాయం చేయాలన్నారు. వర్షాలతో చెరువులు, డ్యామ్లు కళకళలాడుతున్నాయన్నారు. భవిష్యత్లో ఇక నీటి సమస్య ఉండదని కేసీఆర్ అన్నారు.

గోదావరి జలాలు రెండేళ్లలో లక్ష ఎకరాలకు నీరందిస్తాయని, మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయినట్లు కేసీఆర్ పేర‍్కొన్నారు.  ఆదర్శ గ్రామాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహప్రవేశం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లోను పశుగ్రాసం విత్తనాలు వేయాలని, రెండోపంటకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల్లో బోర్ వేసేటప్పుడు జియాలజిస్ట్ల సలహా తీసుకొని వేయాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు