తెలుగు భాషను కాపాడుకోవాలి

29 Aug, 2016 01:33 IST|Sakshi
తెలుగు భాషను కాపాడుకోవాలి
నెల్లూరు(బృందావనం): మధురమైన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పెన్నా రచయితల సంఘం కార్యదర్శి గోవిందరాజు సుభద్రాదేవి పేర్కొన్నారు. తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కస్తూర్బా కళాక్షేత్రం ప్రాంగణంలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. భాగవతాలు, యక్షగానాలు, హరిక«థలు, పద్యాలు, బుర్రకథలు తెలుగుభాష పూలమాలలోని పుష్పాలన్నారు. పుష్పాలు రాలిపోతుండడం బాధాకరమన్నారు. తెలుగుభాష, సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరూ నడుంభిగించాలన్నారు. తొలుత తెలుగుభాషకు విశిష్ట సేవలందించిన గిడుగు రామ్మూర్తికి నివాళులు అర్పించారు.  ఈ సమావేశంలో మోపూరు పెంచలనరసింహం, ఇంద్రగంటి మధుసూదన్‌రావు, అచ్యుత మణి, అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం, గుండాల నరేంద్రబాబు, కవితా కృష్ణమూర్తి , వెంకట్రావ్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు