పదో తరగతి విద్యార్థి కిడ్నాప్‌

20 Oct, 2016 22:57 IST|Sakshi
  • స్నేహితుడే సూత్రధారి
  • పోలీసుల రంగప్రవేశంతో కథ సుఖాంతం
  • రాజమహేంద్రవరం రూరల్‌ :
    సులువుగా సొమ్ము సంపాదించడానికి కిడ్నాప్‌ చేయాలని అతడు భావించాడు. తన స్నేహితుడినే అపహరించి అతడి తండ్రిని రూ.మూడులక్షలు డిమాండ్‌ చేశాడు. చివరకు పోలీసుల రంగప్రవేశంతో దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరం పంచాయతీ పరిధిలోని చింతలు ప్రాంతానికి చెందిన శ్రీపతి శ్రీనివాస్‌ కుమారుడు 14 ఏళ్ల శ్రీపతి మోహ¯ŒSసాయి బొమ్మూరులోని బాలాజీపేటరోడ్డులో ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం పదో తరగతి చదివి వెళ్లిపోయిన హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఉప్పు మునిమాణిక్యం (ఇతడు కూడా మైనర్‌)తో మోహనసాయికి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పాఠశాల అయిన తరువాత మోహనసాయి ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో ఉప్పు మునిమాణ్యికం తన స్నేహితుడు సాయిగోపాల్‌తో కలసి బైక్‌పై వచ్చి తనతో రావాలని కోరాడు. మునిమాణిక్యం తెలిసినవాడే కావడంతో మోహనసాయి వెంటనే బైక్‌పై ఎక్కాడు. మునిమాణిక్యం హౌసింగ్‌బోర్డుకాలనీలోని తన ఇంటికి తీసుకుపోయాడు. అనంతరం మోహనసాయిని ఇంటిలోనే ఉంచి బయటకు వచ్చాడు. సుబ్బారావునగర్‌లో ఒక కిరాణాకొట్టు వద్ద ఒక సిమ్‌ తీసుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో ఆ నంబరు (73962 42285) నుంచి మోహనసాయి తండ్రి శ్రీనివాస్‌కు ఫో¯ŒS చేసి ‘ మీ అబ్బాయికి కిడ్నాప్‌ చేశాం, రూ. రెండు లక్షలు ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశాడు. అనంతరం మళ్లీ ఫో¯ŒS చేసి రూ.మూడులక్షలు ఇవ్వాలని చెప్పి ఫో¯ŒS స్విచ్ఛాప్‌ చేసేశాడు. దీంతో రాత్రి పది గంటల సమయంలో బొమ్మూరు పోలీసులకు శ్రీపతి శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి స్వయంగా రంగంలోకి దిగి కిడ్నాప్‌ కేసుపై దృష్టిపెట్టారు. తూర్పుమండల డీఎస్పీ రమేష్‌బాబు, బొమ్మూరు ఎస్‌సై నాగేశ్వరరావు, సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కిడ్నాప్‌ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. సిమ్‌ నంబర్‌ ఆధారంగా దాన్ని కొనుగోలు చేసిన షాపు యజమాని గుత్తి సతీష్‌గాంధీని గుర్తించి విచారించగా ఉప్పు ముని ఆచూకీ లభ్యం అయ్యింది. రాత్రి 2.30గంటల సమయంలో మునిమాణిక్యంను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న మోహనసాయిని విడిపించారు.  
     
మరిన్ని వార్తలు