డెంగీ వ్యాధి నివారణకు కృషి చేయాలి

19 Sep, 2016 23:58 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు

  • డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు

ఖమ్మం వైద్య విభాగం :  డెంగ్యూ వ్యాధి నివారణకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఏ.కొండల్‌రావు సిబ్బందిని ఆదేశించారు.సోమవారం డీంఎహెచ్‌ఓ కార్యాలయంలో ఖమ్మం క్లస్టర్‌ పరి«ధిలోని సీహెచ్‌ఓ, హెచ్‌ఈఓ, ఎంపీహెచ్‌ఎస్, సూపర్‌వైజర్‌ సిబ్బందికి సీజనల్‌ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఖమ్మం చుట్టూ పీహెచ్‌సీల పరిధిలో డెంగీ వ్యాధి  విజృంభిస్తుందన్నారు.దాని నివారణకు సూపర్‌వైజర్లు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. రాబోయే రెండు నెలల పాటు సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని వైద్యాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సిబ్బంది పనితీరుపై వైధ్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆశలు, ఏఎన్‌ఎంలు గ్రామాలను ప్రతిరోజు సందర్శించి యాంటీ లార్వా, డీ వాటరింగ్, డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  సమావేశంలో జిల్లా సర్వేలైన్స్‌ అధికారిణి డాక్టర్‌ కోటిరత్నం ,డీపీఎంఓ కళావతిబాయి, డీఐఓ వెంకటేశ్వరరావు, ఎస్‌పీహెచ్‌ఓ మాలతి, జిల్లా మలేరియా అధికారి రాంబాబు, డీహెచ్‌ఈ జి.సాంబశివారెడ్డి  పాల్గొన్నారు.


 


>
మరిన్ని వార్తలు