వైఎస్సార్‌ సీపీలో నేడు దుర్గేష్‌ చేరిక

12 Dec, 2016 14:24 IST|Sakshi
  •  బలోపేతం కానున్న పార్టీ
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మాజీ అ««దl్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలసి ఆయన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని తన  నివాసం నుంచి అనుచరులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ పయనమయ్యారు. వివాదరహితుడు, మంచి వక్తగా పేరొందిన దుర్గేష్‌ చేరిక వైఎస్సార్‌ సీపీకి లాభిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దుర్గేష్‌ ఎమ్మెల్సీగా ఎన్నికై ఆరేళ్లు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా దళితవాడల్లో ఎక్కువగా అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా అనుచరులను సంపాదించుకున్నారు.
    30 ఏళ్ల రాజకీయ అనుభవం
    దుర్గేష్‌ 30 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. మొదట రాజమండ్రి వీటీ కాలేజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1980లో ఎ¯ŒSఎస్‌యూఐ రాజమండ్రి టౌ¯ŒS కార్యదర్శిగా, 1982 నుంచి జిల్లా అధ్యక్షునిగా పని చేశారు. 1984లో యువజన కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులై అంచెలంచెలుగా ఎదుగుతూ, 2014లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీకి దుర్గేష్‌ చేసిన సేవలను గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2007లో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు.
    ఉద్దండులతో అనుబంధం
    సౌమ్యునిగా పేరొందిన కందుల దుర్గేష్‌ జిల్లా స్థాయిలో మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లతో మంచి అనుబంధం కొనసాగించారు. ఆయా కాలాల్లో వారి ఆదేశాల మేరకు పార్టీ పటిష్టతకు కృషి చేశారు. రాష్ట్రస్థాయిలో వైఎస్‌ అనుచరుడిగా ఉన్నారు. వైఎస్‌ రాజశేఖరెడ్డి పేదల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డితోనే సాధ్యమని భావించి తాను వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు దుర్గేష్‌ చెప్పారు. 
     
మరిన్ని వార్తలు