వీఐపీలే లక్ష్యంగా..

21 Feb, 2016 03:16 IST|Sakshi

ప్రభుత్వ విప్‌కు ఫోన్ చేసి
డబ్బులడిగిన అగంతకుడి అరెస్ట్

 యాదగిరిగుట్ట: వీఐపీలనే లక్ష్యంగా చేసుకుని.. ఫోన్లు చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.   హైదరాబాద్ బహదూర్‌పురలోని సుల్తాన్ షాహి, లాల్ దర్వాజకు చెందిన మొండ్రాయి కృష్ణమాదిగ మందకృష్ణ మాదిగ పేరు చెప్పుకొని సంఘ కార్యక్రమాలకు ఫండ్ కోసం అని వీఐపీలకు ఫోన్ చేసి సులువుగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఇలా 2010లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్‌రావుకు ఫోన్‌చేసి పార్టీ ఫండ్ కింద 2 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యే శంకర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టయి నాలుగు నెలలు చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించాడు. మళ్లీ జైలు నుంచి బయటకు వచ్చి పలువురు వీఐపీలకు ఫోన్లు చేసి బెదిరించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిపై రౌడీషీట్‌కూడా తెరిచారు. ఇదే క్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతకు కూడా ఫోన్ డబ్బులు కావాలని బెదిరించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వలపన్ని శనివారం అతడిని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు