విద్యుదాఘాతానికి యువకుడి బలి

3 Nov, 2016 01:22 IST|Sakshi
విద్యుదాఘాతానికి యువకుడి బలి
కావలిరూరల్‌ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన బుధవారం పట్టణంలో సంకులవారితోట సాయిబాబా మందిరం వీధిలో జరిగింది. ఒకటో పట్టణ ఎస్‌ఐ జి.అంకమ్మ కథనం మేరకు.. జౌళి రాజశేఖర్‌ అరుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ చదువు మధ్యలోనే ఆపేసి స్థానికంగా కరెంటు, ప్లంబింగ్‌ పనులకు వెళ్తుంటారు.  బుధవారం ఓ కుమారుడు మీరయ్య (20) స్థానిక పాతూరు అరటి తోటలో కరెంటు మరమ్మతుల కోసం తన బాబాయ్‌ భద్రయ్యతో కలిసి వెళ్లాడు. కనెక‌్షన్‌ సరి చేస్తుండగా అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన తోటి పనివారు వెంటనే మెయిన్‌ ఆఫ్‌ చేసి హుటాహుటి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. యువకుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. చేతికెక్కొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రీల్‌ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా!

వార్‌ టీం సక్సెస్‌ పార్టీ..

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌