సర్కారుపై సమరభేరి

9 Jul, 2016 04:30 IST|Sakshi
సర్కారుపై సమరభేరి

జిల్లా వ్యాప్తంగా గడపగడపకూ  వైఎస్సార్ సీపీ ప్రారంభం
ఉరిమే ఉత్సాహంతో ముందుకు సాగిన పార్టీ శ్రేణులు
పాల్గొన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు 
⇔  కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై నాయకుల ధ్వజం 
చంద్రబాబు వంచనను పార్టీ నేతల దృష్టికి తెచ్చిన జనం
అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చిన నేతలు

ప్రజల్ని వంచిస్తున్న చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి మోగించింది. ఉరిమే ఉత్సాహంతో ఆ పార్టీ శ్రేణులు ఊరూరా తిరిగారు. గడప గడపకూ వెళ్లి ప్రజా సమస్యలు ఆలకించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తూ ప్రస్తుత టీడీపీ సర్కారు వైఫల్యాలను, అవినీతిని తెలియజెబుతూ ముందుకు సాగారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. తమ ప్రాంతాలకు వచ్చిన నాయకులకు స్థానికులు ఎదురేగి స్వాగతం పలికారు. తమ కష్టాలను ఏకరువు పెట్టారు. వారికి అండగా ఉంటామంటూ నాయకులు భరోసా ఇచ్చారు. 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద నివాళులర్పించి, కార్యక్రమాన్ని కొనసాగించారు.

 ఒంగోలులో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గడగడపకి వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలవేసి నివాళులు అర్పించిన బాలినేని అనంతరం 9వ డివిజన్‌లోని మసీదులో ప్రార్ధనలు నిర్వహించారు. అక్కడి నుంచే గడగడపకు వైఎస్సార్ సీపీ కార్యాక్రమంలో పాల్గొన్నారు. డివిజన్‌లో ఉదయం నుండి చీకటిపడే సమయం వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ప్రభుత్వ పథకాలు అమలు తీరుని ఆయన ప్రజలని అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్క హామీ అమలు కావడంలేదని, బాబు ఓట్లు వేయించుకొని వంచించాడని ప్రజలు బాలినేని దృష్టికి తెచ్చారు.చంద్రబాబు ఇచ్చిన నూరు హామీ ప్రజాబ్యాలెట్‌ని ప్రజలకు పంపిణీ చేశారు.

 మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డిలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలని అడిగి సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అరుుతే అన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు.

 దర్శి నియోజయవర్గంలోని దర్శి ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. చంద్రబాబుకి ఓటు వేసి తప్పు చేశామని వాపోయారు.

 అద్దంకి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బాచిన చెంచు గరటయ్య ఆధ్వర్యంలో జె.పంగులూరు మండలం ఆరికట్లవారిపాలెం, ైబె టమంజులూరు గ్రామాలతోపాటు మండల కేంద్రం కొరశపాడులో జరిగిన కార్యక్రమంలో 400 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 1500 ఇళ్లకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

 చీరాల రూరల్ మండలం దేవినూతల గ్రామంలో పార్టీ సమన్వయ కర్త యడం బాలాజి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరికూటి అమృతపాణిలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాబ్యాలెట్‌ని పంపిణీ చేశారు. ప్రజా సమస్యలని అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి న్యాయం జరుగుతుందన్నారు.

 గిద్దలూరు నియోకవర్గం అర్ధవీడు మండలం నారాయణపల్లిలో పార్టీ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి గడగడపకి వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేరలేదని చెప్తూ వైఎస్సార్‌సీపీ చేసిన ప్రజా పోరాటాలను తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 సంతనూలపాడులో పార్టీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఫించన్లు సక్రమంగా ఇవ్వడంలేదని, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని, పెట్టుబడి నిధి కూడా పూర్తిగా ఇవ్వలేదని మహిళలు నేతల దృష్టికి తీసుకువచ్చారు.

 పర్చూరు నియోజవ ర్గంలో యద్దనపూడి మండలం చిమటవారిపాలెంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకూ వెళ్లారు. ప్రజా సమస్యలని అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అన్నీ సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలను వంచించిన చంద్రబాబుకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

 కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు రూరల్ మండలం వాసేపల్లిపాడు, వల్లూరులలో పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు రెండేళ్ల పాలనలో వైఫల్యాలను తెలిపే ప్రజా బ్యాలెట్‌ని పంపిణీ చేశారు. రేషన్ కార్డులు తొలగించారంటూ కొంతమంది నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.

 కనిగిరి నియోజకవర్గం కనిగిరి మండలం పునుగోడు గ్రామంలో పార్టీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో గడగడపకి వైఎస్సార్ సీపీ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు వైఫల్యాను తెలుపుతూ ప్రజా సమస్యలని తెలుసుకుంటు కార్యక్రమం నిర్వహించారు.

 యర్రగొండపాలెం నియోజకవర్గంలో పెద్దారవీడు మండలంలో పార్టీ స్థానిక నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు