మంత్రుల మాటలు దారుణం

3 Nov, 2016 02:43 IST|Sakshi
మంత్రుల మాటలు దారుణం

డెంగీతో 23 మంది చనిపోతే ఇద్దరే అని చెప్తారా..?
వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు సుధీర్‌బాబు
రావినూతల గ్రామంలో మృతుల కుటుంబాలకు పరామర్శ

 బోనకల్: మండలంలో డెంగీ జ్వరంతో 23 మంది చనిపోతే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరే మృతి చెందారని చెప్పటం అత్యంత దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు లక్కినేని సుధీర్‌బాబు అన్నారు. రావినూతల గ్రామంలో డెంగీ జ్వరంతో మృతి చెందిన కుటుంబాలను వైఎస్‌ఆర్ సీపీ బృందం బుధవారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలబోరుున సారుుసుధ కుటుంబం నిరుపేద కుటుంబం కావటం ఉన్న ఒక్కంటిని తాకట్టు పెట్టి వైద్యం చేరుుంచినప్పటికి బతకలేదని కుటుంబసభ్యులు సుధీర్‌బాబు ఎదుట కన్నీంటి పర్యంతమయ్యారు. అదేవిధంగా గిరిజన కుటుంబానికి చెందిన గుగులోతు సైదులు ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉండే తరుణంలో డెంగీతో మృతి చెందాడని కుటుంబసభ్యులు విలపించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని పరిశీలించారు. సర్పంచ్ షేక్ వజీర్‌ను గ్రామంలో జ్వరాల పరిస్థితి,  వైద్యసేవలు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.

 డీఎంహెచ్‌ఓ కొండలరావుతో మాట్లాడి జ్వరపీడుతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా లక్కినేని మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు మండలానికి వచ్చి కనీసం డెంగీతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించకపోవటం వారి అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. మండలంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలస్యం సుధాకర్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టౌన్ అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి, మండల నాయకులు షేక్ మౌలాలి, చిట్టోజి శ్రీనివాస్, మర్రి ప్రేమ్‌కుమార్, తాళ్లూరి వెంకటి, గణపారపు వెంకటేశ్వర్లు, ఇరుగు జ్ఞానేష్,  షేక్ సయ్యద్‌బాబు, షేక్ షరీఫ్  పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు