కొత్త రాష్ర్టంలో సరికొత్త రికార్డు

3 May, 2014 03:06 IST|Sakshi

 నర్సంపేట, న్యూస్‌లైన్ : మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు చేసి నర్సంపేట జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తి తో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 87.59 శాతం ఓటింగ్‌తో తెలగాణ కొత్త రాష్ట్రం లో సరికొత్త రికార్డును సొంతం చేసుకుని నంబ ర్-1 స్థానంలో ఉంది.

 సమష్టి కృషి
 నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు, 95 రెవెన్యూ గ్రామాలు, 106 గ్రామ పంచాయతీలు, 2,85,360 మంది జనాభా, 2,05,516 మంది ఓటర్లున్నారు. ప్రజలు ఓటు విలువ తెలుసుకోవడంలో అధికారుల కృషితోపాటు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల పట్టుదల కూడా తోడైంది. 1999 నుంచి ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదవుతూ వస్తోం ది. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలే అధికంగా ఉన్నాయి. అందులోనూ రోడ్డు, ర వాణా సౌకర్యం అంతంత మాత్రమే. అయినా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు కాలినడకన పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు.
 
 ప్రశాంత వాతావరణం
 నర్సంపేటకు కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుంది. ఇక్కడ హత్యా రాజకీయాలూ ఉండే వి. ప్రతీ ఎన్నికల్లో కమ్యూనిస్టులే గెలుస్తూ వచ్చేవారు. ఓడించేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలను అడ్డుకునే క్రమంలో ఘర్షణలు జరిగేవి. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో హత్యలకు దారితీసేది. ఒకానొక దశలో ఓటు వేయడానికి ప్రజలు భయపడే వారు. ఓంకార్ ఎంసీపీఐ స్థాపించిన తర్వాత గెలుపు కోసం ఆయన ప్రతి ఒక్కరితో ఓటు వేయించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన కృషికి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రత్యేక చొరవ తీసుకుంది. అధికారుల సహకారంతో క్రమేణా ప్రజల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవడమే కాకుండా రికా ర్డు సాధించి ఆదర్శంగా నిలవడానికి పునాదు లు పడ్డాయి.

 ఉద్దండుల పోటీ ఓ కారణం
 నియోజకవర్గం జనరల్ కేటగిరికి రిజర్వ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో ఇక్కడి నాయకుల పాత్ర కీలకంగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసే వారే ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా కొనసాగడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను పోలింగ్ బూత్‌ల వరకు తీసుకువచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించ డం ఓటింగ్ అత్యధికంగా నమోదు కావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 జిల్లాల్లో నర్సంపేటలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం గర్వంగా ఉందని ఆయా నాయకులు ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు

మరిన్ని వార్తలు