బంగారు తెలంగాణే లక్ష్యం

29 Apr, 2014 03:21 IST|Sakshi
బంగారు తెలంగాణే లక్ష్యం

కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నది నా ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ఎమ్మెల్యేగా గెలిచిన మూడు, నాలుగు నెలల్లో తొలి ప్రాధాన్యత కింద జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగు, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. నియోజకవర్గంలో తొలి విడత శాటిలైట్ టౌన్‌షిప్ పేరుతో ఐదు వేల ఇళ్ల నిర్మాణం చేపడతా.జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీతో పాటు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా .

 నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా..
 నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఐటీ పార్కు ఏర్పాటు, ప్రభుత్వ భూములు సేకరించి పేదలకు పంపిణీ చేస్తా. మేజర్ గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ భూములు సేకరించి శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయిస్తా.

 ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి
 ప్రత్యేక రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. కానీ సీఎం పదవి కంటే కూడా ఈ ప్రాంత ప్రజల బాగోగులు చూసుకోవడం ముఖ్యం. టీ కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో పేర్కొన్న అంశాలను  అమలు చేసేందుకు కృషి చేస్తా. రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయిస్తా.    

బీసీలు, ముస్లింలు, మైనార్టీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కృషి, హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయిస్తా. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచేందుకు పాటుపడతా.  రైతులకు 9 గంటల పాటు నిరంతరాయం గా విద్యుత్ సరఫరా చేయిస్తా.  స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తా.

మరిన్ని వార్తలు