ఈవీఎంల స్ట్రాంగ్ రూంలకు సీల్

26 Apr, 2014 00:18 IST|Sakshi
ఈవీఎంల స్ట్రాంగ్ రూంలకు సీల్


 తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు పార్లమెంట్ ఎన్నికలు గురువారం ముగియడంతో శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎంలను భద్రపరిచిన అధికారులు అభ్యర్థుల సమక్షంలో సీల్ వేశారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహించారు. గుమ్మిడిపూండి, తిరువళ్లూరు, పూందమల్లి, ఆవడి, మాదవ రం పొన్నేరి నియోజక వర్గాల ఈవీఎంలను పోలీసు బందోబస్తు నడుమ శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. అనంతరం అభ్యర్థుల చేత ఈవీఎంలను భద్రపరిచి స్క్రూటినింగ్ నిర్వహించారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ పోలైన ఓట్లను సరి చూసుకున్న తరువాత వాటికి సీల్ వేశారు. అనంతరం కలెక్టర్ వీరరాఘవరావుమాట్లాడుతూ ఆరంబాక్కం ప్రాంతంలోని నాలుగు మత్స్యకార గ్రామాలలో 10 శాతం ఓటింగ్ కూడా పోల్ కాలేదన్నారు. అక్కడ రీపోలింగ్‌కు అవకాశం లేదని వివరించారు. ఈవీఎంలను భద్రపరిచిన కేంద్రం    వద్ద మూడు అంచెల భద్రతను చేపట్టినట్టు వివరించారు. అభ్యర్థులకు అనుమానాలు ఉన్నట్టయితే అక్కడే తమ ఎజెంట్లను ఉంచుకోవచ్చని ఆయన వివరించారు.

>
మరిన్ని వార్తలు