గులాబీ దళం

5 Apr, 2014 01:11 IST|Sakshi
గులాబీ దళం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పొత్తుల ఊహాగానాలకు తెరదించుతూ టీఆర్‌ఎస్ పార్టీ తవు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా పార్టీల కంటే వుందుగా అసెంబ్లీ  స్థానాలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 69 మందితో ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు జాబితాను విడుదల చేశారు. అందులో జిల్లాకు సంబంధించి చొప్పదండి మినహా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించటం గవునార్హం. వీరిలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఒకరికి గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవవుండగా.. మిగిలిన నలుగురు కొత్త అభ్యర్థులు. తెలంగాణలోనే అత్యధికంగా ఏడుగురు పార్టీ ఎమ్మెల్యేలున్న జిల్లాలో... సిట్టింగ్‌లందరికీ టీఆర్‌ఎస్ తొలి ప్రాధాన్యమిచ్చింది.

 ఎక్కడివాళ్లకు అక్కడే వురోసారి పోటీ చేసే అవకాశం కల్పించింది. ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, సిరిసిల్ల నుంచి కె.తారకరామారావు, కోరుట్ల నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, వేములవాడ నుంచి చెన్నవునేని రమేష్‌బాబు, రామగుండం నుంచి సోవూరపు సత్యనారాయుణకు టిక్కెట్లు కేటారుంచింది.


   సిట్టింగ్‌ల్లో అరుదుగురు ఎమ్మెల్యేలు గడిచిన అరుదేళ్ల వ్యవధిలో వూడోసారి ఎన్నికలు ఎదుర్కోనుండటం విశేషం. 2009లో ఎమ్మె ల్యేలుగా గెలిచిన ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కల్వకంట్ల విద్యాసాగర్‌రావు, కేటీఆర్, రమేశ్‌బాబు 2010 ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశా రు. మరోసారి అక్కడే విజేతలుగా నిలిచారు.


   కేసీఆర్ తనయుుడు కేటీఆర్‌కు ఈసారి కూడా సిరిసిల్ల నుంచి పోటీకి దిగుతున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారని, ఎమ్మెల్యేగా పోటీ చేసి నా.. వేరే చోటికి వలస వెళ్తాతారని కొంతకాలంగా జరిగిన ప్రచారానికి తెర పడింది. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల బరిలో అడుగుపెట్టిన కేటీఆర్ అక్కడే 2010 ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. వరుసగా వూడోసారి కార్మిక క్షేత్రం నుంచే పోటీకి సిద్ధవువుతున్నారు.

 

 గత ఎన్నికల్లో వుహాకూటమిలో టీఆర్‌ఎస్ వుద్ధతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల కవులాకర్, ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సోవూరపు సత్యనారాయుణ ఈసారి గులాబీ గుర్రాలుగా బరిలోకి దిగుతున్నారు. పౌరసత్వానికి సంబంధించిన కేసు వెంటాడుతున్న రమేశ్‌బాబు అభ్యర్థిత్వంపై ఉన్న సందిగ్ధత జాబితా వెల్లడితో తొలగిపోయింది.

   వూజీ వుంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుుడు వొడితెల సతీష్‌బాబును హుస్నాబాద్ నుంచి బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఒప్పందాన్ని ఉల్లంఘించి లక్ష్మీకాంతారావును పోటీకి దింపిన చోటునుంచే ఈసారి ఆయున తనయుడిని పోటీకి దింపటం గవునార్హం. సతీష్‌బాబు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.


ఇటీవలే పార్టీలో చేరిన పుట్ట మధుకు అంద రూ ఊహించినట్లుగానే మంథని టిక్కెట్టు ఖరా రు చేసింది. గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీ చేసిన వుధు కొంతకాలం వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా టీఆర్‌ఎస్ జగిత్యాల నుంచి పోటీకి దిగుతుండటం విశేషం. పొత్తులో భాగంగా 2004లో కాంగ్రెస్‌కు, 2009లో టీడీపీకి ఈ సీటును వదిలేసిన టీఆర్‌ఎస్ ఈసారి ఒంటరిగా పోటీకి దిగుతోంది. ఇటీవలే పార్టీలో చేరిన నేత్ర వైద్యుడు డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్‌కు టిక్కెట్టు కేటారుంచింది. కొత్తగా రాజకీయూల్లోకి వచ్చిన సంజయ్ తొలి ప్రయుత్నంలోనే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.


రెండు నెలల కిందట టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ప్రకటించిన విధంగానే ట్రినిటీ విద్యాసంస్థల నిర్వాహకుడు దాసరి మనోహర్‌రెడ్డికి పెద్దపల్లి నుంచి టిక్కెట్టు కేటారుంచారు. రెండేళ్ల కిందట పార్టీలో చేరిన వునోహర్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయుటం ఇదే తొలిసారి. మెదక్ జిల్లాకు చెందిన తెలంగాణ ధూం ధాం గాయుకుడు రసవురుు బాలకిషన్‌ను వూనకొండూరు అభ్యర్థిగా ప్రకటించారు.

 గత ఎన్నికల్లోనూ ఇదే సీటును ఆశించిన రసవురుు టిక్కెట్ల రేసులోనే భంగపడ్డారు. అరుదేళ్ల తర్వాత ఆయునకు ఈ అవకాశం దక్కినట్లరుంది. ఇటీవలే ఎంపీ వివేక్ పార్టీ వూరటంతో పెద్దపల్లి ఎంపీ స్థానానికి ఈయున అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు జరిగిన ప్రచారానికి తెరపడింది. గజ్జెకట్టి పాట పాడిన రసవురుు తొలిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు.

 అగ్రవర్ణాలకే అగ్రపీఠం

 సామాజిక సమీకరణాలను విశ్లేషిస్తే టిక్కెట్ల కేటారుుంపులో జిల్లాలో అగ్రవర్ణాలకే టీఆర్‌ఎస్ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని 13 నియోజకవర్గాలకు మూడు ఎస్సీ స్థానాలు మినహాయించగా.. మిగిలిన పది నియోజకవర్గాల్లో ఆరు అగ్రవర్ణాలకు, నాలుగు బీసీలకు కేటాయించారు.

స్థానికంగా రాజకీయ ఆధిపత్యం కొనసాగించే వెలమ సామాజిక వర్గానికి సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, వేవుులవాడ సీట్లు కేటాయించారు. మున్నూరు కాపు కులస్థులకు మూడు సీట్లు దక్కాయి. కరీంనగర్, రావుగుండం, వుంథని ఈ జాబితాలో ఉన్నాయి. ముదిరాజ్‌కు ఒకటి, కరణంకు ఒకటి, రెడ్డికి ఒక సీటు కేటారుంచారు.

 చొప్పదండిపై ఉత్కంఠ

 12 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన చొప్పదండి సీటును పెండింగ్‌లో పెట్టింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బొడిగె శోభ, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ ఈ సీటుపై పట్టుబడుతున్నందున పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు