మీ దుఃఖానికి కారణం మీరేనా?

27 Jun, 2017 00:06 IST|Sakshi
మీ దుఃఖానికి కారణం మీరేనా?

సెల్ఫ్‌చెక్‌

మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. మీప్రవర్తనే మీలో ఆనందాన్నైనా, దుఃఖాన్నైనా కలిగిస్తుంది. ఇతరులని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. దీని ద్వారానే అపోహలైనా, కలహాలైనా, మంచి సంబంధాలైనా కలుగుతాయి. వివిధ రకాల ప్రవర్తనలు మీలో సంతోషాన్ని నింపుతున్నాయా? ఆందోళనను కలిగిస్తున్నాయా? ఈ సెల్ఫ్‌చెక్‌ ద్వారా మీ భావాలను తెలుసుకోండి.

1.    ఎవరైనా మిమ్మల్ని అభినందిస్తే చాలా తేలికగా తీసుకొని పెద్దగా స్పందించరు.
ఎ. అవును      బి. కాదు  

2.    మీ స్నేహితులు మీ పర్సనల్‌ విషయాల్లో జోక్యం చేసుకుంటే వాళ్లని తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
ఎ. అవును      బి. కాదు  

3.    నిరాశావాదం మిమ్మల్ని వెంటాడుతుంది.
ఎ. అవును      బి. కాదు  

4.    తప్పు జరిగిందని గ్రహించినా మళ్లీమళ్లీ అలాంటి పొరపాటునే చేస్తుంటారు.
ఎ. అవును      బి. కాదు  

5.    మీకెవరైనా గిఫ్ట్‌ ఇస్తే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు.
ఎ. అవును      బి. కాదు  

6.    ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు చాలా దిగులు చెందుతారు.
ఎ. అవును      బి. కాదు
 
7.    మీకు రావలసిన ప్రమోషన్‌ వివిధ కారణాలవల్ల రాకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు.
ఎ. అవును      బి. కాదు
 
8.    అర్థంలేని అనుమానాలు, అపోహలు మిమ్మల్ని వేధిస్తుంటాయి.
ఎ. అవును      బి. కాదు  

9.    పార్టీలో సూప్‌ మీపై పడితే పెద్ద అవమానంగా భావిస్తారు.
ఎ. అవును      బి. కాదు  

10.    సమాజంలో చాలామంది మంచివారు కారని మీ విశ్వాసం.
ఎ. అవును      బి. కాదు  

‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీ ఆలోచనలతో మీకై మీరే అసంతృప్తిని, దుఃఖాన్ని కలిగించుకుంటారు. ఎప్పుడూ దిగాలుగా ఉంటూ నిరాశావాదంతో, అభద్రతా భావంలో ఉండిపోతారు. ఇలాంటి ఆలోచనలను, ప్రవర్తనను మీరు వెంటనే వదిలిపెట్టాల్సి ఉంటుంది. ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. నెగెటివ్‌ ఆలోచనలకు దూరంగా ఉంటారు. పదిమందితో కలిసిపోయి హాయిగా ఉంటారు.

మరిన్ని వార్తలు