ఇంత చాలు

1 Apr, 2016 23:25 IST|Sakshi

ఆరోగ్యంగా ఉండటానికి సగటు వ్యక్తులు తీసుకోవాల్సిన ఆహారం ఈ కింద పేర్కొన్నట్లుగా ఉండే చాలు. ఉదయం టిఫిన్‌లో రెండు ఇడ్లీ లేదా ఒక దోశ లేదా ఉప్మా (వెజిటబుల్స్‌తో వండిన కూరలతో), దీంతో పాటు ఒక గ్లాస్ పాలు. ఏదైనా ఒక పండు. మధ్యాహ్నం భోజనంలో మూడు/నాలుగు రోటీలు లేదా మూడు గుప్పెళ్ల అన్నం, ఆకలి తీవ్రతను తగ్గించే తగినన్ని సలాడ్స్‌తో పాటు ఒక కప్పు పప్పు, రోజుకు ఒక రకం చొప్పున అన్ని రకాల వెజిటబుల్స్ కవర్ అయ్యేలా ఒక కూర, పెరుగు. చికెన్, గుడ్డు, చేపలు తినదలచుకుంటే కేవలం మధ్యాన్నం పూటే వాటిని తీసుకోవడం మంచిది.


ఇది కూడా పరిమితంగా. సాయంత్రం కాసిన్ని మొలకెత్తిన గింజలు తీసుకొని ఇక రాత్రి భోజనం అంతా మధ్యాన్న భోజనంలాగే తీసుకోవాలి. మధ్యాన భోజనం కంటే రాత్రి భోజనం పరిమాణం మరింత తగ్గితే అది ఆరోగ్యానికీ, వృథాను నివారించడానికీ తోడ్పడుతుంది.

 

>
మరిన్ని వార్తలు