ఆహారం ఎక్కువైతే అనర్థాలు ఎన్నో... | Sakshi
Sakshi News home page

ఆహారం ఎక్కువైతే అనర్థాలు ఎన్నో...

Published Fri, Apr 1 2016 11:25 PM

ఆహారం ఎక్కువైతే   అనర్థాలు ఎన్నో...

 మనం తినే ఆహారం ఎక్కువైతే మొదట అది స్థూలకాయానికి దారి తీయవచ్చు. అలా బరువు పెరగడంతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రావచ్చు. ఇలా బరువు పెరుగుతూ పోతే అది కాలక్రమేణా డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ ఆప్నియా, గుండెజబ్బులు, గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ), గాల్‌స్టోన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు కారణం కావచ్చు.


అయితే కడుపు మాడ్చుకోనక్కర్లేదు. కడుపునిండా తినండి. కానీ ఆకలి తీరాక కూడా అదేపనిగా ఆహారాన్ని కడుపులోకి పంపకండి. అలా పంపకూడదు అనుకున్నాం కాబట్టి ప్లేట్లో మాత్రం అస్సలు వదలకండి.

 

Advertisement
Advertisement