భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే..

21 Oct, 2023 13:04 IST|Sakshi

చాలామంది ఆహారం తిన్న వెంటనే తేలిగ్గా తీసుకుని చేసే పనులే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం. భోజనం తిన్న వెంటనే చల్లటి పదార్థాలు గానీ లేదా పండ్లు తీసుకుంటుంటాం. అలాగే బాగా స్పైసీ ఫుడ్‌ తినేసి హెర్బల్‌ టీలు వంటివి తాగేస్తుంటారు కొందరూ. నిజానికి ఇలాంటి అలవాట్లు చాలా ప్రమాదం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణలు. మన జీర్ణ వ్యవస్థ పాడవడ్డానికి ఆ అలవాట్లే ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు. 

తిన్న వెంటనే పండ్లు తింటే..
పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ భోజనం చేసిన వెంటనే పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతారంటే భోజనం కాగానే పండ్లు తినడం వల్ల అందులోని ఎంజైమ్‌లు విచ్ఛిన్నమై ఆహారంతో కలిసిపోయి పొట్టలో సమస్యలను కలిగిస్తాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చల్లటి నీరు..
ప్రస్తుతం చాలా మంది ఆహారం తీసుకున్న వెంటనే రిఫ్రిజిరేటర్‌లో.. కొందరైతే మరీ డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచిన చల్లని నీరు తాగుతున్నారు. ఇలా చల్లటి తాగడం వల్ల కడుపులో ఉత్పత్తి అయ్యే డైజెస్టివ్‌ ఎంజైమ్‌లు పొట్టను చల్లగా చేసి, జీర్ణక్రియ వ్యవస్థను స్తంభింపజేస్తాయి. అంతేకాదు, శరీరం ఆహారంలోని పోషకాలను గ్రహించడం మానుకుంటుంది. దీని కారణంగా పోషకలోపం వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి తిన్న వెంటనే చల్లటి నీటిని తాగడం మానుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

స్పైపీ ఫుడ్‌ తీసుకున్న తర్వాత టీ తీసుకుంటే..
వేడి ఆహారాలు తీసుకున్న తర్వాత హెర్బల్‌ టీలు తీసుకోవడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పొట్టలో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పెరిగిపోతాయి కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే బాగా వేడిగా ఉండే కాఫీ, టీ వంటి పానీయాలు తాగడం మానుకోవాలి.  

(చదవండి: స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!)

మరిన్ని వార్తలు