అందాల బాదామి గుహలు

5 Dec, 2017 22:58 IST|Sakshi

సందర్శనీయం

బాదామి క్షేత్రం బీజాపూర్‌ నుంచి హుబ్లీ వెళ్లే దారిలో ఉంది. ఇక వీటి విశిష్టత గురించి చెప్పాలంటే... ఇవి మనదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే ప్రసిద్ధగుహలు.  ఎర్రని రాతితో ఉండే ఈ గుహలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేరు పొందిన ఈ ప్రదేశం ఒకప్పుడు తూర్పు చాళుక్యులకు నివాస స్థలం. చాళుక్యుల శిల్పకళాభిరుచికి ఈ గుహలు చక్కని ఉదాహరణ. నటరాజస్వామి, మహిషాసుర మర్దిని, గణపతి, నెమలి వాహనంపై కుమారస్వామి, విష్ణుమూర్తి శిల్పాలు మనోహరంగా ఉంటాయి.

జైనమతానికి చెందిన ప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. జైనతీర్థంకరులు ఇక్కడ నివసించారని ప్రతీతి. సుందర పర్యాటక క్షేత్రం ఇది. విశాలమైన గుహలు, ఆలయాలతోపాటు పెద్ద సరోవరం ఉన్న అందమైన గుహలు ఇవి. బాదామిలో రైల్వే స్టేషన్‌ ఉంది. రైల్వేస్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో బాదామి గుహలు ఉన్నాయి. ఇక్కడికి చేరడానికి బాగల్‌కోట్‌ నుంచి బస్సు సౌకర్యం ఉంది. బాగల్‌కోట్‌ నుంచి బాదామికి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాదామిలో వసతి సదుపాయాలు ఉండవు. కాబట్టి బాగల్‌కోట్‌లో బస చేసి రోడ్డు మార్గంలో బాదామి గుహలను చేరడం అనువుగా ఉంటుంది.

మరిన్ని వార్తలు